8186963759 and 8886155889 weavemedias@gmail.com www.weavemedias.com

friends colony,puppalagud,manikonda, Hyderabad, India - 500018

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
0

0 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Weave in friends colony,puppalagud,manikonda, Hyderabad

మనిషి తానున్న చోటు నుంచి కదలకుండా ప్రపంచం లో ఏమేమి జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాడు అంటే దానికి కారణం మీడియా.నేడు మనిషికి ఉన్న ప్రాథమిక అవసరాలలో కూడు ,గూడు ,గుడ్డ లతో పాటు టీవీ అనేది కుడా చేరిపోయింది.అంటే మనిషి ఎంటర్టైన్మెంట్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.ఈ ఎంటర్టైన్మెంట్ అనేది అతని జీవిత కలం పాటు కొనసాగుతుంది.అంటే టీవీ కి ఆదరణ ఎల్ల వేలాల ఉంటుంది అని అర్థం అవుతుంది.టీవీ కి ఆదరణ ఉన్నప్పుడు అందులో వచ్చే చానల్స్ కి అంటే మీడియా రంగానికి కుడా ఎప్పుడు ఆదరణ ఉంటుంది.మీడియా రంగం అనేది ఆర్థిక మంధ్యాలతో సంబంధం లేనిది.అందుకే మీడియా రంగం రోజు రోజు కి విస్తరిస్తూ వస్తోంది.నెలకో ఛానల్ పుట్టుకోస్తున్న తరుణం లో ఉపాధి అవకాశాలు కుడా అదే స్థాయిలో ఉంటున్నాయి.కానీ ఆ అవకాశాలు అందరికి అందట్లేదు.కారణం నైపుణ్యం.మీడియా రంగానికి కావాల్సిన నైపుణ్యాలను భోధించే సరైన సంస్థలు లేకపోవడంతో పాటు ఉన్న సంస్థలు సైతం నాణ్యమైన విద్యనూ భోదించక పోగా మీడియా రంగంలోకి రావాలి అనుకున్న వారిని తప్పు దోవ పట్టిస్తుండటం తో చాల మంది మీడియా లోకి రావాలి అంటే భయపడుతూ..వెనకడుగు వేస్తున్నారు.
అలాంటి వారి కోసం ..మీడియా లోకి వచ్చి తమని తాము నిరూపించు కోవాలి అనుకొనే వారి కొసమే ‘వీవ్ ఏ టూ జెడ్ మీడియా సర్వీసెస్’ ప్రారంభం అవుతోంది. మీడియా రంగం లోకి రావాలని కలలు కన్న ఓ సాధారణ అమ్మాయి..ఓ మీడియా సంస్థలో స్టూడెంట్ గా పాటలు నేర్చుకొన్న అమ్మాయి,తిరిగి అలాంటి సంస్థలోనే మీడియా గురించి పాటాలు చెప్పిన అమ్మాయి..నేడు ఓ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా ,స్క్రిప్ట్ రైటర్ గా ,ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా పని చేస్తూ..తనకంటూ.. ఓ పేరు ని సంపాదించుకొంది.మీడియాలోకి రావాలి అనుకొన్నప్పుడు తాను ఎదుర్కొన్న సమస్యలను గుర్తుంచుకొని నేడు తన లాగ మీడియా లోకి రావాలి అనుకుంటున్నా వారిని ప్రోత్సహించాలి అనే సదుద్దేశం తో ఏర్పాటు చేస్తున్న సంస్థే ‘వీవ్ ఏ టూ జెడ్ మీడియా సర్వీసెస్’
వీవ్ అందిస్తున్న కోర్సుల వివరాలు.
మీడియా న్యూస్ మరియు ఎంటర్టైన్మెంట్ అనే రెండు విభాగాలుగా విడిపోయింది.కానీ ఒక ఛానల్ లో రెండు విభాగాలకి సంభందించిన పనులు ఉంటాయి.అందుకే వీవ్ రెండు రంగాలకు సంబంధించి కోర్సులను అందిస్తోంది.
· న్యూస్ ప్యాకేజ్

· క్రియేటివ్ ప్యాకేజేస్

న్యూస్ ప్యాకేజ్


న్యూస్ గాదరింగ్
కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు మనిషి కుక్కను కరిస్తే అది వార్త అన్నారు మీడియా పెద్దలు.ఇందులో మనం గమనించాల్సిన విషయం వార్త అనేది క్యురాసిటిని ,ఇంట్రెస్టింగ్ ని కలిగించేదిలా వుండాలి.అలాంటి వార్తలకే మీడియాలో ప్రాముఖ్యత ఉంటుంది.అలంటి వార్తలను ఎలా సేకరించాలి?వార్తల సేకరణలో పాటించాల్సిన నియమాలు ఏంటి?టెక్నిక్స్ ఏంటి ?మొదలైన విషయాల గురించి చెప్పేదే న్యూస్ గాదరింగ్.
న్యూస్ రిపోర్టింగ్
సేకరించాల్సిన వార్తలను ఎలా రిపోర్ట్ చేయాలి?
ఎంతో క్యురాసిటిని కలిగించే వార్తను సేకరించాక దానిని ప్రపంచమంతటికీ చిటికెలో తెలియజేయాలంటే ఉన్న ఏకైక మార్గం రిపోర్టింగ్.మరి రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలి.ఉన్న కొంచెం టైం లో జరిగిన సంఘటన గురించిన పూర్తి వివరాలు రిపోర్ట్ చేయాలి అంటే పాటించాల్సిన టెక్నిక్స్ ఏంటి? రిపోర్టింగ్ టైం లో బాడి లాంగ్వేజ్ ఎలా ఉండాలి.రిపోర్టింగ్ టైం లో తెలుసుకోవాల్సిన టెక్నికల్ ఐటమ్స్ ఏంటి? మొదలైన విషయాల గురించి చెప్పేదే న్యూస్ రిపోర్టింగ్.
న్యూస్ రైటింగ్
వార్తలను మీడియా పరిభాష లోకి ఎలా మార్చాలి?
వార్తను సేకరించి,ఆ వార్తను రిపోర్ట్ చేయడం తోటే వార్తకు సంభందించి పూర్తి వివరాలు ప్రజలకు తెలియవు.కట్టే కొట్టే తెచ్చే అంటే ఎవరికీ అర్థం కాదు.ఆ వార్తను మీడియా పరి భాషలోకి మార్చడం ఆ భాష కుడా సామాన్యుడి కి అర్థమయ్యే రూపం లో ఉండేలా చూసుకోవడం ,వార్తకు సంభందించి పూర్తి వివరాలు తెలియజేయడం లాంటి పనులు న్యూస్ రైటింగ్ లో ఉంటాయి.దీనినే స్క్రిప్ట్ రైటింగ్ అంటారు.స్క్రిప్ట్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి.ప్రింట్ మీడియా స్క్రిప్టింగ్ ఎలా ఉంటుంది.ఎలక్ట్రానిక్ మీడియా స్క్రిప్టింగ్ ఎలా ఉంటుంది అనే విషయాలు న్యూస్ రైటింగ్ లో ఉంటుంది.
న్యూస్ ఎడిటింగ్
ఒక వార్తను స్క్రిప్ట్ రూపం లోకి మార్చాక..ఆ స్క్రిప్ట్ లో వార్తకు సంభందించిన అంశాలు ఎంత వరకు ఉన్నాయి.వాటిలో అవసరమైనవి ఏవి.అనవసరమైనవి ఏవి.ఆ స్క్రిప్ట్ న్యూస్ రూపం లో ఉందా లేదా? ఏ అంశాలు జత చేస్తే అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.ఆ స్క్రిప్ట్ లో ఏమైనా భాష బేధాలు ఉన్నాయా..అసహ్యకరమైన పదాలు,ఎవరినైనా కించపరిచే మాటలు వాడార..మొదలైన విషయాలను చూడటమే న్యూస్ ఎడిటింగ్.
న్యూస్ ప్రెజెంటింగ్
ఒక వార్త ప్రపంచానికి తెలియాలి అంటే ఆ వార్తకు ఓ రూపం ,ఓ..శబ్దం ఉండాలి.ఆ వార్తను ఎవరో ఒకరు ప్రెజెంట్ చేయాలి.ఆ ప్రెజెంట్ చేయడమనేది ఓ పద్ధతి లో ఉండాలి.ఒక పద్ధతి ప్రకారం వార్తను ప్రెజెంట్ చేయడమే న్యూస్ ప్రేజెంటింగ్ వార్తను చదివే వ్యక్తికి భాష పరిజ్ఞానం,విషయ పరిజ్ఞానం,లోక జ్ఞానం అనేవి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు.వార్తలు చదివేటప్పుడు ముఖం లో ఎలాంటి హావ భావాలు ఉండాలి.పదాలను ఎలా పలకాలి.పాజెస్ ఎక్కడ తీసుకోవాలి.బాడి లాంగ్వేజ్ ఎలా ఉండాలి.మొదలైన విషయాలు న్యూస్ ప్రేజెంటింగ్ లో తెలుసుకోవచ్చు.
క్రియేటివ్ ప్యాకేజ్
ఈ... ప్రపంచంలో టాలెంట్ లేని మనిషంటూ ఉండడు.ఆ టాలెంట్ ని గుర్తించి దానికి మెరుగులు దిద్దుకొంటే అదే అతనికి ఉపాది అవుతుంది.మరి ఉపాధి వచ్చాక ఉన్నత అవకాశాలు అంది పుచ్చుకోవాలి అంటే ముఖ్యంగా కావాల్సింది క్రియేటివిటీ.తాను చేస్తున్న పనిలో విభిన్నతను,ప్రత్యేకతను చూపించడమే క్రియేటివిటీ.క్రియేటివిటీ అనేది ఒకరి సొత్తు కాదు.అల అని మన నుంచి ఎవరు దోచుకోనేది కాదు.ఎప్పటికప్పుడు మార్పులు సంతరించుకొంటు..నిత్య నూతనంగా ఉండే మీడియా ఫీల్డ్ లో క్రియేటివిటీ కే అధిక ప్రాధాన్యత ఉంటుంది.తమ క్రియేటివిటీ కి అప్ డేట్ ఉన్న వాళ్ళకే శాశ్వత స్థానం ఉటుంది.మరి క్రియేటివిటీ అనేది ఒకరు భోధిస్తే వస్తుందా అంటే కచ్చితంగా రాదు.క్రియేటివిటీ లేదని ఓ మూలాన కూర్చోకూడదు.ఎలాంటి విషయాలు నేర్చుకోవాలన్న అది సాధన తోనే సాధ్యం కాబట్టి ,నలుగురి లోకి వచ్చి నాలుగు విషయాలు తెలుసుకొంటున్నప్పు మనలోను ఆలోచనలు మొదలవుతాయి.అలాంటి ఆలోచనే క్రియేటివిటీ కి దారి తీస్తాయి.
అలా మీలో..ఉన్న టాలెంట్ ని బయటికి తీయడం తో పాటు దానికి క్రియేటివిటీని జత చేసే విధంగా పలు రకాలైన కోర్సులను మేము అందిస్తున్నాము.క్రియేటివిటీ అనేది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విభాగం లో ఉపయోగ పడుతుంది.అందుకోసమే క్రియేటివ్ థాట్స్, క్రియేటివ్ రైటింగ్,క్రియేటివ్ ప్రెజెంటేషన్ అనే మూడు రకాలైన కోర్సులను అందిస్తోంది వీవ్.ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే కార్యక్రమం రూపొందించాలనే ఆలోచనతో మొదలైన క్రియేటివ్ థాట్స్ ,క్రియేటివ్ గా స్క్రిప్ట్ రాయడం తో పాటు క్రియేటివ్ గా ప్రెజెంట్ చేయడం తో పూర్తవుతుంది.అందుకే క్రియేటివ్ ప్యాకేజ్ లో కాప్చర్ ఎవ్రీతింగ్ అంటే వీడియో రికార్డింగ్..ట్రిమ్ సంథింగ్ అంటే ఎడిటింగ్ ,విజువలైజ్ బెస్ట్ థింగ్స్ అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ లాంటి అదనపు కోర్సులు కుడా జత చేయడం జరిగింది.

Popular Business in hyderabad By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.